ముఖానికి మాస్కుల అవసరాన్ని నొక్కి చెప్పే మరో ప్రయోగ ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. మనం సాధారణంగా మాట్లాడినా వెలువడే తుంపర్లు గాల్లో దాదాపు ఎనిమిది నిమిషాల పాటు ఉంటాయని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని 'ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజస్టివ్ అండ్ కిడ్నీ డిసీజ్' పేర్కొంది.
గాలి తక్కువగా ఉండే ఆసుపత్రులు, ఇళ్లు, క్రూజ్ షిప్‌లు వంటివి కరోనావైరస క్లస్టర్లుగా ఎందుకు మారుతున్నాయనే అంశంపై పరిశోధనలకు ఈ సమాచారం మరింత ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ పరిశోధనలో వెలుగు చూసిన అంశాలను 'ది ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' అనే జర్నల్‌లో ప్రచురించారు.