తెలంగాణ

telangana

ETV Bharat / international

వ్యాక్సిన్ బూస్టర్‌ డోసులు అవసరమా? - ఆంటోనీ ఫౌచీ

కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్​ డోసులపై శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఈ డోసులు పొందాల్సిన అవసరం ఉండకపోవచ్చని కొందరు చెబుతున్నారు.

booster dose
బూస్టర్ డోసులు, వ్యాక్సిన్ బూస్టర్

By

Published : Jun 4, 2021, 10:23 AM IST

కొవిడ్‌-19 టీకాల వల్ల జీవితకాల రక్షణ లభిస్తుందా లేక కొంతకాలానికి బూస్టర్‌ డోసులు అవసరమవుతాయా అన్నదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న అగ్రశ్రేణి వ్యాక్సిన్ల వల్ల కరోనా నుంచి దీర్ఘకాల రక్షణ లభించొచ్చని కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. తరచూ బూస్టర్‌ డోసులు పొందాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పారు.

తనకు తారసపడే వైరస్‌లను మానవ శరీరం ఎలా గుర్తుంచుకుంటుందన్న అంశంపై కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఈ వాదనను బలపరుస్తున్నాయన్నారు. అయితే కరోనా వైరస్‌లో ఉత్పరివర్తనలు ఇంకా చోటుచేసుకుంటున్నందువల్ల ఈ అంశంపై మరింత పరిశోధన అవసరమని తెలిపారు.

ఫైజర్‌, మోడెర్నా సంస్థలు రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు కేవలం యాంటీబాడీలపైనే ఆధారపడవని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ప్రత్యామ్నాయ రక్షణ విధానాలుగా శరీరంలో అనేక అంచెల భద్రత ఉంటుందని పేర్కొన్నాయి. టీకా పొందాక విడుదలయ్యే యాంటీబాడీలు కొంతకాలానికి తగ్గిపోతాయి. అవి ఏ స్థాయికి పడిపోయాక.. సొంతంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గిపోతుందన్నది ఇంకా తేలలేదు.

టీకా రక్షణ అపరిమితం కాదని అమెరికాలో అగ్రశ్రేణి అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఇటీవల సెనేట్‌ ఉపసంఘాన్ని తెలిపారు. ఫ్లూకు ఇచ్చినట్లుగానే కొవిడ్‌కూ ఏటా టీకాలు ఇవ్వాల్సి ఉంటుందని ఫైజర్‌, మోడెర్నాలు చెబుతున్నాయి. ఈ మేరకు బూస్టర్‌ డోసులను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. వీటిని ఎప్పుడు ఇవ్వాలన్నది ప్రభుత్వ నియంత్రణ సంస్థలే నిర్ణయించాలి. ఏటా కాకుండా కొన్నేళ్లకోసారి బూస్టర్లు అవసరమవుతాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:'భారత్​లో కరోనా కట్టడికి అదే గేమ్​ఛేంజర్​'

ABOUT THE AUTHOR

...view details