అమెరికాలో తుపాకీ విష సంస్కృతి నానాటికీ పెరిగిపోతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా తుపాకులు వినియెగిస్తూ... విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా కొలరాడో రాష్ట్రం డెన్వర్‌లోని పాఠశాలలో కాల్పులకు పాల్పడింది అక్కడి విద్యార్థులేనని తేలింది.
స్టెమ్ పాఠశాలలో 18 ఏళ్లు కూడా నిండని ఇద్దరు విద్యార్థులు... తోటివారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి సమయంలో పాఠశాలలో 1,850 మంది విద్యార్థులు ఉన్నారు.