Student Beating Teacher: అల్లరి చేసే విద్యార్థిని కంట్రోల్ చేయడానికి టీచర్లు వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వడమో లేక మిగతా విద్యార్థుల నుంచి దూరంగా కూర్చోపెట్టడమో చేస్తారు. అయితే ఇలా చేయడం ఓ టీచర్ ప్రాణాల మీదకు తెచ్చింది. క్లాస్‌రూమ్‌లో తెగ అల్లరి చేస్తున్నాడని ఓ ఐదేళ్ల చిన్నారిని ఆ టీచర్ వేరే గదిలో కూర్చోపెట్టింది. అంతే.. ఆమె ఆ గదికి రాగానే మీద పడి దాడి చేశాడు ఆ చిన్నారి. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది.
అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాకు చెందిన పైన్స్ లేక్స్ ఎలిమెంటరీ స్కూల్.. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం తరగతులు నిర్వహిస్తూ ఉంటుంది. దాడికి పాల్పడ్డ చిన్నారి కూడా అక్కడే శిక్షణ పొందుతున్నాడు. రోజూలాగే గత బుధవారం కూడా స్కూల్‌కు వచ్చిన చిన్నారి.. క్లాస్‌లో తెగ అల్లరి చేశాడు. చుట్టుపక్కల ఉన్న వస్తువులు అన్నీ చెల్లాచెదురుగా విసిరేసి.. కుర్చీలను పడేశాడు. దీంతో చిన్నారి అల్లరి కట్టడి చేయడానికి టీచర్ అతడిని కూల్‌డౌన్ రూమ్‌గా పేర్కొనే ప్రత్యేక గదికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది.