అమెరికాలోని అనేక ప్రాంతాలను మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలుండే అరిజోనా రాజధాని ఫీనిక్స్ పట్టణాన్ని హిమపాతం అనూహ్యంగా ముంచెత్తింది. మంచుకు ఉరుములు తోడవటం వల్ల పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి.
ముఖ్యంగా అరిజోనా దక్షిణ ప్రాంతంలో భారీ హిమపాతం కురుస్తోంది. ఈ ప్రాంతంలో వర్షాలు కురవడమే అరుదు.. అలాంటిది ఇప్పుడు మంచు కప్పేయడం గమనార్హం. వీటితో పాటు బలమైన గాలులు తోడవ్వడం వల్ల చెట్లు నేలకొరిగాయి.
కాలిఫోర్నియాలోనూ మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పర్వతాలన్నింటినీ మంచు దుప్పటి కప్పేసింది. ఈ రాష్ట్రంలో అంతర్జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. వర్షం, మంచు కురవవచ్చని తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. శాన్ఫ్రాన్న్సిస్కో తీర ప్రాంతాల నుంచి దుమ్ము తుపానులు రావచ్చనే హెచ్చరికలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి.