ప్రముఖ నాసా శాస్త్రవేత్త, భారతీయ అమెరికన్ సునీతా విలియమ్స్.. అమెరికాలో ఉన్న భారత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న వేళ.. అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచించాలని ఉద్ఘాటించారు. ప్రస్తుతం భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య చాలా చిన్నదని చెప్పారు విలియమ్స్.
'అంతరిక్షంలో లేరు కదా'
అంతరిక్షంలో తాను 322 రోజులు గడిపిన విషయాన్ని గుర్తుచేసిన విలియమ్స్.. ఒంటరిగా ఉన్న సమయం ఆత్మపరిశీలన చేసుకునేందుకు మంచి అవకాశమని ఉద్ఘాటించారు. ప్రయోజనకరంగా, క్రియాశీలంగా, సానుకూలంగా ఆలోచించాలని సూచించారు. అంతరిక్ష నౌకలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని పేర్కొన్న ఆమె.. మీ కుటుంబం, స్నేహితులతో కాలం గడపాలన్నారు. బాధ్యతగా వ్యవహరించాలని.. ఇతరులకు వైరస్ సోకేందుకు కారణం కాకూడదని హితబోధ చేశారు.
కిచెన్ నుంచి..