భారత సంతతికి చెందిన ఇద్దరు సాహసోపేత పాత్రికేయులను ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కారం వరించింది. చైనాలోని కల్లోలిత షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ దురాగతాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన 'బజ్‌ఫీడ్ న్యూస్' జర్నలిస్టు మేఘా రాజగోపాలన్ 'అంతర్జాతీయ రిపోర్టింగ్' విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అక్కడ లక్షల మంది ముస్లింలను నిర్బంధించడానికి భారీగా నిర్మించిన రహస్య కారాగారాలను ఆమె తన వినూత్న పరిశోధనాత్మక కథనాలతో బట్టబయలు చేశారు.
భారత సంతతికి చెందిన మరో పాత్రికేయుడు నీల్ బేడికీ ఈ పురస్కారం లభించింది. భవిష్యత్‌లో నేరానికి పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి అమెరికాలోని ప్యాస్కో కౌంటీలో స్థానిక భద్రత అధికారులు తెచ్చిన ఒక కంప్యూటర్ మోడలింగ్‌లోని లోపాలను ఎత్తిచూపుతూ రాసిన కథనాలకు క్యాథలీన్ మెక్ గ్రోరీతో కలిసి ఆయన అవార్డును పంచుకోనున్నారు. సదరు మోడలింగ్ ద్వారా చిన్నారులు సహా దాదాపు వెయ్యి మందిపై అధికారులు నిఘా పెట్టారు. నీల్.. 'తంపా బే టైమ్స్'లో పనిచేస్తున్నారు.
స్టార్ ట్రిబ్యూన్‌కు..