అమెరికా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కొత్త రకం కొవిడ్ టీకాను రూపొందించారు. ఇది ప్రస్తుతం ఉన్న టీకాల కంటే ఎక్కువ సామర్థ్యం గలదని, దీనిని ఎలుకలపై ప్రయోగించగా ఒక్క డోసుతోనే వాటిలో రోగనిరోధక శక్తిని పెంచిందని వెల్లడించారు.
చౌకగా టీకా..
ఓ జర్నల్‌లో ఈ టీకా గురించి ప్రచురించారు. ఇందులో కరోనా వైరస్‌కు చెందిన ప్రొటీన్ స్పైక్స్‌తో జత చేసిన అతిసూక్ష్మ కణాలు ఉంటాయని తెలిపారు.
"ఒక్కడోసులోనే కరోనాను అంతం చేయగల వ్యాక్సిన్‌ను రూపొందించడమే మా లక్ష్యం. ఇందులో మేము విజయవంతం అయితే.. చౌకగా కూడా లభిస్తుంది. పేద, మధ్య తరగతి దేశాలను దృష్టిలో పెట్టుకుని టీకాను తయారు చేస్తున్నాము."
-పీటర్ కిమ్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు
ఈ వ్యాక్సిన్‌ను భద్రపరచడానికి అతి శీతల ఉష్ణోగ్రతలు అవసరం లేదని పరిశోధకులు తెలిపారు. దీనిపై మరింత పరీక్షలు జరపాల్సి ఉందని, త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ చేపడతామని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇది చదవండి :ప్రపంచవ్యాప్తంగా మరో 6లక్షల పాజిటివ్ కేసులు