ఆకాశవీధిలో మరో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. గురువారం రాత్రి చందమామ 'స్ట్రాబెర్రీ ఫుల్ మూన్'గా కనిపించనుంది. అర్థరాత్రి 12.10 గంటలకు చంద్రుడు భూమికి అతి సమీపంగా రానున్న నేపథ్యంలో.. ఈ దృశ్యం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే మూడు రోజుల పాటు జాబిల్లి నిండుగా దర్శనమివ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఈశాన్య అమెరికాలోని ఓ తెగకు చెందిన వారి నుంచి దీనికి 'స్ట్రాబెర్రీ ఫుల్ మూన్' అనే పేరు వచ్చినట్లు నాసా పేర్కొంది. ఈ మాసంలో ఈశాన్య అమెరికా వారు.. స్ట్రాబెర్రీ పంట కోతను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో.. స్ట్రాబెర్రీ ఫుల్ మూన్ అనే పేరు వచ్చింది.
జాబిల్లి రంగుతో ఈ పేరుకు సంబంధం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. పింక్ రంగులో మూన్ కనిపించదని స్పష్టం చేశారు.