అమెరికా విస్కాన్సిన్లోని ఓ క్యాసినో(జూదగృహం)లో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి కాల్పులకు తెగబడ్డారు. అయితే కాల్పుల ఘటనపై కచ్చితమైన సమాచారం లేదని.. గాయపడిన వారి పరిస్థితులు సహా, ఎవరినీ అరెస్టు చేసినట్లూ సమాచారం లేదని చెప్పారు. ఈ మేరకు గ్రీన్ బేలోని ఒనిడా క్యాసినో ప్రతినిధి బొబ్బి వెబ్స్టర్ అనే మహిళ ట్విట్టర్లో తెలిపారు.
క్యాసినో భద్రత కోసం స్థానిక పోలీసుల సహాయం కోరినట్లు ఆమె తెలిపారు. అలాగే సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు వివరించారు.
"వ్యక్తి ఎక్కడ కాల్పులు జరిపాడో సరిగ్గా తెలియదు, ఎంతమంది వ్యక్తులు చనిపోయారో కూడా తెలియదు."