తెలంగాణ

telangana

ETV Bharat / international

నడిసంద్రంలో 'కరోనా'.. అంతుచిక్కని ప్రశ్నలు!

కొవిడ్​కు సంబంధించి ఓ మిస్టరీ.. శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. అర్జెంటీనాలో 'ఉషుయా' నుంచి చేపల వేటకు బయల్దేరింది ఓ నౌక. అయితే అంతకుముందే అందులోని మత్సకారులను 14రోజులు క్వారంటైన్​లో​ ఉంచి.. అన్ని పరీక్షలు చేయించారు. వాటిలో నెగిటివ్​ వచ్చిన వారిని వేటకు తీసుకెళ్లారు. అయితే నడిసంద్రంలోకి వెళ్లిన ఆ నౌకలో కరోనా కల్లోలం సృష్టించింది. ఇది ఎలా జరిగింది?

spending 35 days at sea Fishermen test positive
నడిసంద్రంలో కరోనా.. అంతుచిక్కని ప్రశ్నలు!

By

Published : Jul 19, 2020, 11:02 PM IST

కరోనా వైరస్‌కు సంబంధించిన ఓ మిస్టరీ నౌక కేసు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను కలవర పెడుతోంది. దీనిలో వాస్తవాలు తెలిస్తే ఇప్పటి వరకు వైరస్‌పై ఉన్న సమాచారం మొత్తం మారిపోవచ్చు. అసలు వైరస్‌ ఎన్నాళ్లు బతికి ఉంటుంది? ఇంక్యూబేషన్‌ సమయం ఎంత? క్వారంటైన్‌ ఎన్నాళ్లు చేయాలి? ఇవన్నీ మారినా ఆశ్చర్యపోనవసరంలేదు. అసలు వైద్యరంగానికి సవాళ్లు విసురుతున్న ఆ కేసు ఏమిటీ..

ప్రపంచం చివరి నుంచి బయల్దేరి..

అర్జెంటీనాలో 'ఉషుయా' పేరుతో ఓ ప్రదేశం ఉంది. దీనిని 'ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌' అని పిలుస్తారు. ఇక్కడ నుంచి ప్రజలు భారీ సంఖ్యలో చేపల వేటకు వెళుతుంటారు. జూన్‌ 6వ తేదీన ఇక్కడి 'ఏచిజన్‌ మారు పేరున్న ఓ నౌక చేపల వేటకు బయల్దేరింది. అన్ని సజావుగా సాగితే ఈ నౌక జులై 20న తిరిగి తీరానికి చేరాల్సి ఉంది. దీనిలో 61 మంది నావికులు ఉన్నారు. ఈ నౌక 35రోజులు సముద్రంలో గడిపాక జులై12నే హడావుడిగా తీరానికి వచ్చేసింది. దీనికో కారణం ఉంది. వీరు సముద్రంలోకి వెళ్లిన తర్వాత కొన్నాళ్లకు కొందరిలో జలుబు, జ్వరం రావడం మొదలైంది. మెల్లగా ఇది మిగిలిన వారికి కూడా పాకింది. చివరిలో నౌకలోని వైద్యసిబ్బంది కూడా వీటి బారిన పడ్డారు. దీంతో నౌకను తప్పనిసరై తీరానికి చేర్చారు. నౌకలోని 61 మందిలో 57 మంది నావికులు కరోనావైరస్‌ బారిన పడినట్లు తేలింది.

14 రోజులు క్వారంటైన్‌ చేసినా..?

ఈ నౌక ప్రయాణం మొదలుపెట్టడానికి ముందు నావికులు మొత్తానికి కరోనా పరీక్షలు చేశారు. అందులో వారికి నెగిటీవ్‌ వచ్చింది. ఆ తర్వాత 14 రోజులు ఓ హోటల్‌లో నిర్బంధ క్వారంటైన్‌ చేయించారు. వీరు ఓడలోకి ఎక్కించిన సామగ్రిని క్షుణ్ణంగా పరీక్షించారు. ఆ తర్వాతే ప్రయాణం మొదలైంది.

35 రోజుల ప్రయాణం మధ్యలో కొత్త వారు ఎవరూ నౌకలోనికి రాలేదు. నౌకలో వారు ఎవరూ బయటకు పోలేదు. బయట నుంచి కొత్తగా సామగ్రి కూడా ఏమీ రాలేదు.

అంతుచిక్కని ప్రశ్నలు..

కరోనా వైరస్‌ రోగి ఉమ్మి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో పరీక్షల్లో నెగిటీవ్‌ వచ్చి.. క్వారంటైన్‌ చేసిన లక్షణాలు లేని వారి నుంచి ఎలా వ్యాపించింది?

  • గాలి ద్వారా వ్యాపిస్తోందని అనుకున్నా ఈ నౌక మరో నౌక సమీపంలోకి కూడా వెళ్లలేదు. ఈ నౌక మరో నౌకకు దగ్గరగా వెళ్లింది. వీటి మధ్యదూరం 4 కిలోమీటర్లు. ఈ విషయాన్ని నౌకలోని లోకేటర్‌ను ఆధారంగా చేసుకొని అర్జెంటీనా నావికాదళం నిర్ధరించింది.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇంక్యూబేషన్‌ సమయం అత్యధికంగా రెండు వారాలు ఉంటుంది. 'ఏచిజన్‌ మారు' నావికులు క్వారంటైన్‌లో ఉన్నారు. కొన్నాళ్లు సముద్రంలో గడిపారు. ఆ తర్వాత లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఇన్నాళ్లు ఇంక్యూబేషన్‌ సమయం ఉంటుందా అనే అంశంపై పరిశోధనలు చేపట్టారు. ఒక వేళ వస్తువులపై కరోనా వున్నా అది కొన్ని రోజులు మాత్రమే జీవిస్తుంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ప్రస్తుతం నావికులను ఓడలోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. అవసరమైన వారిని మాత్రమే ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ఇదీ చూడండి:దోమల వల్ల కరోనా వ్యాప్తి చెందదు!

ABOUT THE AUTHOR

...view details