తెలంగాణ

telangana

ETV Bharat / international

ఓడ మునిగి ఏడుగురు మృతి.. 14 మంది గల్లంతు

Fishing Boat Sinks: కెనడాలోని న్యూఫౌండ్​లాండ్​ తీర ప్రాంతంలో ఓ స్పానిష్​ ఓడ ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Fishing Boat Sinks
ఓడ మునిగి ఏడుగురు మృతి.

By

Published : Feb 16, 2022, 2:47 AM IST

Fishing Boat Sinks: చేపల వేటకు వెళ్లిన ఓ స్పానిష్​​ ఓడ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 14 మంది గల్లంతయ్యారు. కెనడాలోని న్యూఫౌండ్​లాండ్​ తీరానికి సమీపంలో మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఓడలో 24 మంది సిబ్బంది ఉన్నట్లు స్పెయిన్ అధికారులు వెల్లడించారు.

ప్రమాదానికి గురైన ఓడ 'విల్లా దే పిటాన్​క్సో' (స్పెయిన్​ ప్రభుత్వం విడుదల చేసిన చిత్రం)

అదే కారణం..

సముద్రంలో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ఓడ ప్రమాదానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు. 'విల్లా దే పిటాన్​క్సో'గా పిలిచే ఈ ఓడ మునిగిపోవడాన్ని ముందుగా అక్కడే సమీపాన ఉన్న మరో స్పానిష్​ ఫిషింగ్​ బోట్​ సిబ్బంది గుర్తించినట్లు తెలిపారు. కెనడా అధికారుల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన ఓడను ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపారు.

ఇదీ చూడండి :సముద్రంలో మునిగిన వ్యక్తికి కరోనా టెస్టులు- 41రోజుల్లో 28సార్లు పాజిటివ్!

ABOUT THE AUTHOR

...view details