స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన వ్యోమనౌక 'డ్రాగన్' క్రూ(సిబ్బంది) సరికొత్త రికార్డును సృష్టించనున్నారు. అమెరికా ప్రయోగించిన వ్యోమ నౌకలో.. అత్యధిక కాలం అంతరిక్షం (84 రోజులు)లో గడిపిన వ్యోమగాములుగా నిలవనున్నారు.
పరిశోధనల కోసం గతేడాది నవంబర్లో నలుగురు వ్యోమగాములు మైకెల్ హోప్కిన్స్, విక్టర్ గ్లోవర్, శన్నాన్ వాకర్, సోయిచి నోగుచిలు.. డ్రాగన్ వ్యోమనౌకతో అంతరిక్షంలోకి ప్రవేశించారు.