అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్.. నాసాతో కలిసి చేపట్టనున్న అంతరిక్ష యాత్ర బుధవారానికి వాయిదా పడింది. వందలాది మైళ్ల మేర భారీ ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
షెడ్యూల్ ప్రకారం.. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఆరు నెలల మిషన్లో భాగంగా.. ఆదివారం ఉదయం నలుగురు వ్యోమగాములతో ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో వాతావరణం ప్రశాంతంగానే ఉన్నప్పటికీ... ఈశాన్య తీరంలో భారీ తుపాను బీభత్సం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మిషన్ను వాయిదా వేస్తున్నట్లు శనివారం అధికారులు తెలిపారు.