తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2021, 1:25 PM IST

ETV Bharat / international

600వ వ్యక్తితో అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్​ వ్యోమనౌక

నలుగురు వ్యోమగాములతో స్పేస్​ ఎక్స్​ వ్యోమనౌక​ అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లింది. ఇందులో అంతరిక్షానికి వెళ్లిన 600వ వ్యక్తిగా.. జర్మనీకి చెందిన మథియాస్​ మౌరర్​ ఘనత సాధించినట్లు నాసా వర్గాలు తెలిపాయి

SpaceX launch
స్పేస్ ఎక్స్​ రాకెట్

స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌక.. నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కక్ష్యలోకి తీసుకెళ్లింది. ఇందులో 600వ వ్యక్తి రోదసి యాత్రకు వెళ్లినట్లు నాసా వర్గాలు తెలిపాయి. 60 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో.. జర్మనీకి చెందిన మథియాస్​ మౌరర్​ ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నాయి. ఈ వ్యోమనౌక​ బయలు దేరిన 24 గంటల్లోపు ఈ నలుగురు అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారు.

స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌక నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తీసుకొచ్చిన రెండు రోజుల తర్వాత పలుమార్లు అంతరాయాల మధ్య బుధవారం బయలుదేరినట్లు నాసా పేర్కొంది.

ఇదీ చూడండి:200 రోజుల తర్వాత స్పేస్​ నుంచి భూమికి వ్యోమగాములు

ABOUT THE AUTHOR

...view details