తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒకే ఒక్క కేసు వచ్చిందని దేశమంతా లాక్​డౌన్ - హాంకాంగ్

డెల్టా వైరస్​ విజృంభణతో కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి పలు దేశాలు. తమ దేశంలో కొత్తగా ఒక కరోనా కేసు రాగా... పూర్తి లాక్​డౌన్​ విధించింది న్యూజిలాండ్. కాగా, రెండు డోసుల టీకా వేయించుకున్నవారికి 8 నెలల తర్వాత బూస్టర్​ డోసు ఇచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోంది.

COVID
కరోనా టీకా

By

Published : Aug 17, 2021, 4:24 PM IST

ఒకే ఒక్క కరోనా కేసు వెలుగుచూడగా.. కఠిన చర్యలు తీసుకుంది న్యూజిలాండ్​ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు లాక్​డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్​ మంగళవారం ప్రకటించారు. మహమ్మారిని అంతం చేయకపోతే జరిగే నష్టం భరించలేమని, కాబట్టి దానిని అదుపు చేయడానికి 50 లక్షల దేశ జనాభా కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.

రోగి నివసించే ఆక్లాండ్​, అతడు పర్యటించిన కోరమండల్​లో 7 రోజులు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో 3 రోజుల పాటు పూర్తి లాక్​డౌన్​ ఉంటుందని జెసిండా తెలిపారు. ఈ ప్రకటనతో నిత్యావసరాల దుకాణాల వద్ద ప్రజలు లైన్లు కట్టారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్​లో న్యూజిలాండ్​ డాలర్​ విలువ పడిపోయింది.

బూస్టర్​ డోసు తప్పదా?

ఇక వయసుతో నిమిత్తం లేకుండా రెండో డోసు టీకా పూర్తయిన 8 నెలల తర్వాత అమెరికన్లు బూస్టర్​ డోసు తీసుకోవాలని యూఎస్​ నిపుణులు సూచించే అవకాశం ఉంది. దేశంలో డెల్టా విజృంభణ, ఇజ్రాయెల్​ లాంటి దేశాల్లో టీకా ప్రభావం తగ్గిపోవడం లాంటి అధ్యయనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

క్వారంటైన్​ గడువు పొడిగింపు..

అమెరికా సహా మరో 15 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విధించే క్వారంటైన్​ గడువును 21 రోజులకు పెంచింది హాంకాంగ్. ఇదివరకు మీడియం రిస్క్​ విభాగంలో ఉన్న మలేసియా, థాయ్​లాండ్​, ఫ్రాన్స్​ సహా 15 దేశాల్లో కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తీవ్ర రిస్క్​ విభాగంలో చేర్చింది.

ఇదివరకు మీడియం రిస్క్​ విభాగంలో ఉన్న దేశాలకు 7 రోజుల క్వారంటైన్ నిబంధన​ ఉండగా దానిని 14 రోజులకు పెంచింది హాంకాంగ్​. కాగా, లో రిస్క్​లో ఉన్న ఏకైక దేశం న్యూజిలాండ్​కు 7 రోజుల క్వారంటైన్​ గడువు కొనసాగుతోంది.

ఇదీ చూడండి:5 నెలల కనిష్ఠానికి కరోనా కేసులు- వ్యాక్సినేషన్​లో కొత్త రికార్డు

ABOUT THE AUTHOR

...view details