ఫైజర్ టీకాకు ఇటీవల అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) ఆమోదం తెలిపిన నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మొదటగా వ్యాక్సిన్ను ట్రంప్ అధికార వర్గంలోని పలువురు అధికారులకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. అయితే వీరిలో ఎంతమందికి వ్యాక్సిన్ను ఇవ్వనున్నారో స్పష్టత లేదని వివరించింది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదని స్పష్టం చేసింది.
ఏదేమైనా ట్రంప్ అధికార వర్గం శ్వేతసౌధం వీడేలోపు వారికి టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని తెలిపింది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ సైతం..తాను వ్యాక్సిన్ను ఎప్పుడు తీసుకోవాలన్న దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం.