క్రిస్మస్ పరేడ్లో పాల్గొన్న జనాలపైకి తన ఎస్యూవీతో (US Christmas parade accident) దూసుకెళ్లాడు ఓ డ్రైవర్. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. ఇందులో చిన్నారులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా విస్కాన్సిన్లోని వౌకేశా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఘటన తర్వాత ఆ ప్రాంతం అంతా భీతావహ వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ చీఫ్ డేన్ థాంప్సన్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
కారు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లిందా? లేదంటే ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించినవని పేర్కొంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కారు దూసుకెళ్లిన సమయంలో పలుమార్లు తుపాకీ శబ్దం వినిపించింది. కారును ఆపేందుకు పోలీసులే ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులు
ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
పహారా కాస్తున్న పోలీసు సిబ్బంది
ఇదీ చదవండి:ఆర్మీ క్యాంప్ ఎదుట గ్రనేడ్ పేలుడు.. నగరమంతా హై అలర్ట్