తెలంగాణ

telangana

ETV Bharat / international

మైమరపించే మంచుకోట

మరి కొద్ది రోజుల్లో శీతకాలం ముగియనుంది. ఈ లోపు అద్భుత మంచు దృశ్యాలను చూడాలనుకుంటున్నారా..? అయితే అమెరికాలోని నార్త్ వుడ్​స్టక్స్​కు పయనం కావాల్సిందే.

నార్త్ వుడ్​స్టక్స్

By

Published : Mar 3, 2019, 9:02 AM IST

శీతకాలం పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది ఎముకలు కొరికే చలి, కనువిందు చేసే పకృతి రమణీయ దృశ్యాలు. ఎంత చలి ఉన్నా ఈ కాలం ప్రకృతి అందమే వేరు.

మరి కొద్ది రోజుల్లో ఈ కాలం ముగియనుంది, భగభగ మండే భానుడు తరుముకొస్తున్నాడు. ఈ సమయంలో ఏదైనా అద్భుత ప్రదేశాన్ని చూడాలనుందా...అయితే అమెరికాలోని 'ఐస్​ కాజిల్​'కు ప్రయాణంకండి.

మైమరిపించే మంచు అందాలు

అమెరికాలోని నార్త్​ వుడ్​స్టక్స్​ ప్రాంతంలో ఒక ఎకరం స్థలంలో మంచుతో సొరంగాలు, గృహాలు ఏర్పాటు చేశారు. వీటిని ఎంతో కష్టంతో అద్భుతంగా రూపొందించారు నిపుణులు. ఈ మనోహర దృశ్యాలు చూడటానికి క్యూ కడుతున్నారు పర్యటకులు.

భారీ సంఖ్యలో వస్తోన్న పర్యటకులను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కాజిల్​​ నిర్వాహకుడు.

కాజిల్​కు విశేష ఆదరణ దక్కుతోంది, ఇంత గుర్తింపు లభిస్తుందని ఊహించలేదు. శుక్ర, శని వారాల్లో టికెట్లు భారీగా అమ్ముడుపోతున్నాయి. - మట్​ పాసీటో, ఐస్​ కాజిల్​ నిర్వాహకుడు

ఎటు చూసినా జీవత్వం ఉట్టిపడేలా కాజిల్​ను నిర్మించారు. ముఖ్యంగా రాత్రి పూట కాజిల్​లో జరిగే లైట్​ షో అద్భుతంగా ఉంటుంది. లైట్​షోలో మరో ప్రత్యేకత సంగీతం. సంగీతం ఆస్వాదిస్తూ మంత్రముగ్ధులవుతున్నారు పర్యటకులు.

గత మూడు సంవత్సరాలుగా కాజిల్​ని నిర్వహిస్తున్నారు. కాజిల్​కు మూడు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా వచ్చే పర్యటకులు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. కాజిల్​ నిర్మాణం వెనుక ఎంత కష్టం దాగుందో వివరించారు నిర్వహకుడు మట్​ పాసీటో

మంచుగోడల లోపల 70 నీటి గొట్టాలు ఉంటాయి. వీటి మధ్య దూరం 15 అడుగులు. వీటిలోకి నీరు రాగానే ఫ్రీజర్ల ప్రభావంతో నీరు గడ్డ కడుతోంది. దీంతో నీరు ఘనీభవించి మంచు గడ్డలుగా మారతాయి. వాటితో నిపుణులు సొరంగాలు, మంచు కళాఖండాలు తయారు చేస్తారు. - మట్​ పాసీటో, ఐస్​ కాజిల్​ నిర్వహకుడు

ABOUT THE AUTHOR

...view details