అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సామాజిక మాధ్యమాల నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రముఖ ఫొటో మెసేజింగ్ యాప్ స్నాప్‌ఛాట్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని నిర్ణయించింది.
అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక ఘటనకు ట్రంప్ కారకులయ్యారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే కారణంతో ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ ఖాతాలపై నిషేధం విధించాయి.
నిషేధం సరైందే: జాక్ డోర్సే
అమెరికా కాంగ్రెస్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి తర్వాత ట్విట్టర్ చేపట్టిన చర్యలను కంపెనీ సీఈఓ జాక్ డోర్సే సమర్థించుకున్నారు. ఈ ఘటన తర్వాత ట్రంప్ ఖాతాను తొలగించిన తెలిసిందే. ట్విట్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే స్పందిస్తూ ట్రంప్ ఖాతాను నిషేధించడం సరైన నిర్ణయమే కానీ.. అదోక ప్రమాదకరమైన ఉదాహరణగా మిగిలిపోతుందని అంగీకరించారు. ట్రంప్ ఖాతాలో పోస్టు చేసిన అంశాలు హింసను ప్రేరేపించేలా ఉండటం వల్ల 88 మిలియన్ల ఫాలోవర్లులున్న ఖాతాను నిషేధించింది. కానీ ఇటువంటి విషయాలు ప్రజల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని డోర్సే ట్విట్టర్లో తెలిపారు.
ఇదీ చూడండి:ట్రంప్‌కు ఫేస్బుక్, ట్విట్టర్ వరుస షాకులు