అమెరికాలో జెట్ ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో వెళుతున్న జెట్.. పెర్సీ ప్రీస్ట్, టెన్నెస్సీ సరస్సులో కూలింది. ఆ ఘటనలో ఎవరూ బతికి ఉన్నట్లు అనిపించడం లేదని అధికారులు భావిస్తున్నారు. టెన్నెస్సీ సరస్సు.. బోటింగ్, ఫిషింగ్కు ప్రసిద్ధి.
సరస్సులో కూలిన జెట్- ఏడుగురు మృతి! - అమెరికా
అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో వెళుతున్న జెట్ ఓ సరస్సులో కూలింది. దీంతో జెట్లో ఉన్న ఏడుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు.
జెట్
అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. మృతదేహాల కోసం గాలింపు చేపట్టాయి.
ఇదీ చదవండి:ఇంటిపై కూలిన విమానం- నలుగురు మృతి