అమెరికా సెనేట్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో ఆభిశంసన ప్రక్రియ మంగళవారం అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల్లో ఓటమి అంగీకరించని ట్రంప్ 'ఫైట్ లైక్ హెల్' అంటూ తన మద్దతుదారులను ప్రేరేపించి క్యాపిటల్ హింసాకాండకు పాల్పడినట్లు ఓ గ్రాఫిక్ వీడియోను ప్రదర్శించారు. క్యాపిటల్ ఘటనకు సంబంధించిన ఫొటోలను ఈ వీడియోలు చూపించారు.
తొలుత విచారణను నిలిపివేసేందుకు యత్నించిన ట్రంప్ బృందం విఫలమైంది. ట్రంప్ అభిశంసనపై విచారణ జరిపేందుకు 56 మంది సెనేటర్లు అంగీకరించగా 44 మంది నిరాకరించారు. ఈ ప్రక్రియలో భాగంగా... మాజీ అధ్యక్షుడి అభిశంసనపై విచారణ రాజ్యంగబద్ధమే అని తెలిపి ఆరుగురు రిపబ్లికన్లు... డెమొక్రాట్లకు మద్దతుగా నిలవడం గమనార్హం. ట్రంప్ విచారణను నిలిపివేసేందుకు 67 మంది సెనేటర్ల అంగీకారం అవసరం.