భూగర్భజలాల దుర్వినియోగం వంటి మానవ కార్యకలాపాలు, ప్రకృతి వైపరిత్యాల వల్ల భూమి ఉపరితలం కుంగిపోతోందని పరిశోధకులు హెచ్చరించారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా 63.5 కోట్ల మంది ప్రభావితమవుతారని.. వీరిలో ఆసియా ప్రజలే ఎక్కువగా ఉంటారని తేల్చిచెప్పారు. రానున్న నాలుగేళ్లల్లో 9.78 మిలియన్ డాలర్ల జీడీపీపై ఈ సమస్య ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.
2024 నాటికి.. ప్రపంచ జనాభాలో 19శాతం(అంతర్జాతీయ జీడీపీలో 21శాతం)పై ఈ ప్రభావం ఉంటుందని సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. గత శతాబ్దంలో.. భూగర్భజలాల క్షీణత వల్ల 34 దేశాల్లోని 200 ప్రాంతాల్లో నేల కుంగిపోయిందని పరిశోధకుల బృందం చేసిన అధ్యయనంలో తేలింది.