తెలంగాణ

telangana

ETV Bharat / international

'కట్​-కాపీ-పేస్ట్' ఆవిష్కర్త మృతి.. సిలికాన్​ వ్యాలీ సంతాపం - Larry Tesler death

కంప్యూటర్​ శాస్త్రవేత్త, 'కట్​, కాపీ, పేస్ట్​'​ సృష్టికర్త ల్యారీ టెస్లర్ మరణించారు. సాంకేతిక రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆయన మృతి పట్ల సిలికాన్​ వ్యాలీ సంతాపం తెలిపింది. ఆయన సేవలను స్మరించుకుంటూ ట్వీట్​ చేసింది.

Silicon Valley inventor of cut, copy and paste dies
కట్​ కాపీ పేస్ట్ ఆవిష్కర్త మృతి

By

Published : Feb 20, 2020, 2:37 PM IST

Updated : Mar 1, 2020, 11:03 PM IST

కంప్యూటర్​లో విరివిగా వినియోగించే 'కట్​, కాపీ, పేస్ట్​' ఆవిష్కర్త.. జిరాక్స్​లో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ల్యారీ టెస్లర్​ మృతి చెందారు. సాంకేతిక రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆయన జ్ఞాపకాలను స్మరిస్తూ సిలికాన్​ వ్యాలీ సంతాపం ప్రకటించింది.

74 ఏళ్ల వయస్సులో మృతి చెందిన టెస్లర్​ సుదీర్ఘకాలం జిరాక్స్​పైనే పరిశోధనలు చేశారు. అందులో అద్భుత ప్రావీణ్యం సాధించారు. 'కట్​, కాపీ, పేస్ట్'​ కమాండ్​లను రూపొందించి.. వాటిపై విస్తృత ఆవిష్కరణలు చేశారు.

'టెస్లర్​ పని చేసిన రోజులన్నీ విప్లవాత్మమైనవే. ఆయన సోమవారం చనిపోయారు. ఆయనను స్మరించుకునే కార్యక్రమంలో మాతో పాటు కలవండి.'

- స్టాన్​ఫోర్డ్​ విశ్వవిద్యాలయం

ఫైండ్​, రీప్లేస్​లూ ఆయన సృష్టే

విస్తృతంగా ఉండే సమాచారంలో మనకు కావాల్సినది సులభంగా వెతుక్కునేలా, మార్పులుచేర్పులు చేసుకునేందుకు వీలుండేలా రూపొందించిన 'ఫైండ్​, రీప్లేస్​' కమాండ్లను కూడా ఈయనే సృష్టించాడు.

'కట్, కాపీ, పేస్ట్ కమాండ్లను సృష్టికర్త. కంప్యూటర్ సైన్స్ శిక్షణను ప్రతి ఒక్కరికీ అవసరం అని గ్రహించారు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్​ కలిగి ఉండాలని భావించిన గొప్ప వ్యక్తి టెస్లర్​.'

- కంప్యూటర్ హిస్టరీ మ్యూజియం, సిలికాన్ వ్యాలీ

ల్యారీ టెస్లర్ అమెజాన్​, యాపిల్​, యాహూ వంటి దిగ్గజ సంస్థల్లో పలు హోదాల్లో తన విశిష్ట సేవలు అందిచారు. జిరాక్స్​ విభాగంలో పాలో ఆల్టో పరిశోధనా సంస్థతో కలిసి పనిచేశారు.

యాపిల్​లో ప్రస్థానం..

దివంగత టెక్​ దిగ్గజం స్టీవ్ జాబ్స్ 1980లో టెస్లర్​ను తన యాపిల్​ కంపెనీలో నియమించారు. టెస్లర్ హయాంలోనే యాపిల్​కు చెందిన లిసా సాఫ్ట్​వేర్​ ప్రాచుర్యం పొందింది. యాపిల్​లోనే 17 ఏళ్ల పాటు చీఫ్​ సైంటిస్ట్​గా పనిచేశారు టెస్లర్.​ అంతేకాకుండా 'ఎడ్యుకేషన్ స్టార్టప్‌'ను కూడా టెస్లర్​ స్థాపించారు.

ఇదీ చదవండి:'కాపీ కొట్టండి.. దొరికితే బుద్ధిగా ఉండండి'

Last Updated : Mar 1, 2020, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details