అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. సామాన్యులే కాదు ఏకంగా పోలీసు అధికారులు సైతం ఇందుకు బలైపోతున్నారు. తాజాగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన సిక్కు పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. హ్యూస్టన్‌లో హారీస్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ పోలీస్ అధికారిగా సందీప్ సింగ్ థాలివాల్ పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ కారును ఆపి తనిఖీ చేస్తుండగా అందులోని దుండగుడు సందీప్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. సందీప్ సింగ్ అక్కడికక్కడే మరణించారు.
అప్రమత్తమైన అధికారులు కారులో ఉన్న జంటను అదుపులోకి తీసుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే సందీప్‌సింగ్‌పై కాల్పులకు దిగినట్లు తెలుస్తోందని షెరీఫ్ ఈడీ గొంజాలెజ్ తెలిపారు.