తెలంగాణ

telangana

ETV Bharat / international

'లెక్కకు రాని కొవిడ్ మరణాలు 12 లక్షలు' - రెండింతలు ఎక్కవుగా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మరణాల సంఖ్య.. లెక్కల్లో చూపిన దాని కంటే చాలా ఎక్కువ ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. వాస్తవ మృతుల సంఖ్య 30 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా వేసింది.

WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ, డబ్ల్యూహెచ్​ఓ

By

Published : May 22, 2021, 5:33 AM IST

Updated : May 22, 2021, 6:53 AM IST

కొవిడ్ మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ఆందోళనకరమైన విషయాన్ని బయటపెట్టింది. మృతుల గణన నిర్దుష్టంగా సాగడం లేదని తెలిపింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య లెక్కల్లో చూపిన దానికంటే ఎక్కువే ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ దేశాలు.. 18 లక్షల మంది కొవిడ్ కారణంగా మరణించినట్లు తెలిపాయని.. వాస్తవానికి మృతుల సంఖ్య 30 లక్షలు పైగా ఉండొచ్చని నివేదికలో పేర్కొంది.

2020 డిసెంబర్ 31 కల్లా ప్రపంచవ్యాప్తంగా 8.2 కోట్ల మందికి కొవిడ్ సోకిందని, 18 లక్షల మంది మృత్యువాతపడ్డారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

అయితే.. అన్ని దేశాలు కొవిడ్​కు సంబంధించిన సరైన గణాంకాలు సేకరించే సామర్థ్యం సంపాదించాలని డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు. కొవిడ్​ మహమ్మారి.. ప్రపంచ దేశాలు ఆరోగ్య రంగం, సైన్స్​పై దృష్టి సారించేలా చేసిందని పేర్కొన్నారు.

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం.. 16,56,33,000 మందికి కొవిడ్ సోకింది. 34,32,000 మంది వైరస్​కు బలయ్యారు.

ఇదీ చదవండి:అత్యంత శక్తిమంతమైన గామా కిరణాల ఆవిష్కరణ!

Last Updated : May 22, 2021, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details