అమెరికాలోని టెన్నీసీ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పులు స్థానికంగా కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఓ పోలీసు అధికారి సహా పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.