అమెరికాలోని దక్షిణ రాష్ట్రాలను తుపాను అతలాకుతలం చేస్తోంది. తుపాను కారణంగా లౌసీయానాలో ఒకరు మృతిచెందినట్లు సెయింట్ లాండ్రీ పారిష్ అధ్యక్షుడు జెస్సీ బెల్లార్డ్ తెలిపారు. మరో ఏడుగురికి గాయాలైనట్లు పేర్కొన్నారు. లౌసీయానాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
ఫ్లోరిడాలో తుపాను బీభత్సానికి అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. మిస్సిసిపీ, లౌసీయానాలో తుపాను ధాటికి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.