తెలంగాణ

telangana

ప్లాస్మాథెరపీకి ఉత్తమ దాతలు వారే..

By

Published : Oct 20, 2020, 3:03 PM IST

కరోనా తీవ్రత అధికంగా ఉన్న రోగుల్లోనే యాంటీబాండీలు ఎక్కువ మోతాదులో ఉండి, వైరస్‌ నుంచి కాపాడుతాయని ఓ అధ్యయనంలో తేలింది. ప్లాస్మా థెరపీకి వారే తగినవారని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి కొవిడ్‌ రోగులకు ఇవ్వటం వల్ల వైరస్‌ను కట్టడి చేసే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు.

Severe COVID-19 patients may be best donors for plasma therapy: Study
కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారే ప్లాస్మాథెరపీకి ఉత్తమ దాతలు

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులే ప్లాస్మా థెరపీకి ఉత్తమ దాతలని ఓ అధ్యయనంలో తేలింది. వారిలోనే యాంటీబాండీలు ఎక్కువ మోతాదులో ఉండి, వైరస్‌ నుంచి కాపాడుతాయని పేర్కొంది. ప్లాస్మా థెరపీకి వారే తగినవారని ఆ అధ్యయనంలో వెల్లడైంది. క్లినికల్‌ ఇన్వెస్టిగేషన్‌ జర్నల్‌ ఈ పరిశోధనను ప్రచురించింది.

కొవిడ్‌ నుంచి కోలుకున్న వృద్ధ పురుషులు ప్లాస్మా దానానికి తగినవారని ఆ పరిశోధన తేల్చింది. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి కొవిడ్‌ రోగులకు ఇవ్వటం వల్ల వైరస్‌ను కట్టడి చేసే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని శస్త్రవేత్తలు తెలిపారు. ప్లాస్మా థెరపీకి సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని, ప్లాస్మా దాతలకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి మార్గదర్శకాలు లేవన్నారు. ప్లాస్మా దాతలను ఎంచుకునేందుకు వయసు, లింగం, వైరస్‌ తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ రోగ లక్షణాలు ఉన్నవారిలో యాంటీబాడీలు పెద్దమొత్తంలో ఉండటమే కాకుండా నాణ్యమైనవి ఉంటాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details