అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సర్వీస్(యూఎస్సీఐఎస్)పై దాఖలు చేసిన దావాను ఏడు వ్యాపార సంస్థలతో కూడిన బృందం వెనక్కి తీసుకుంది. విదేశీ ఉద్యోగ వీసాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలను మార్చేందుకు ఫెడరల్ సంస్థ అంగీకరించిన నేపథ్యంలో బృందం ఈ చర్యలు చేపట్టింది.
అక్టోబర్ 1 తర్వాత దాఖలు చేసిన హెచ్-1బీ పిటిషన్లను యూఎస్సీఐఎస్ రద్దు చేసింది. హెచ్-1బీ వర్కర్లు ఉద్యోగాల్లో చేరేందుకు గడువు అక్టోబర్ 1 తర్వాత ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. దీనికి వ్యతిరేకంగా మార్చి నెలలో.. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ దావా దాఖలు చేసింది. ఇలా రద్దు చేయడం వల్ల వ్యాపారాల్లో ఇమ్మిగ్రేషన్ సమస్యలు వస్తాయని కౌన్సిల్ పేర్కొంది.