తెలంగాణ

telangana

ETV Bharat / international

11 మంది మహిళల్ని చంపిన సీరియల్‌ కిల్లర్‌.. చివరకు! - ఆంటోనీ సోవెల్

అమెరికాలో 11 మంది మహిళల్ని చంపి, మరణశిక్షకు గురైన ఆ సీరియల్​ కిల్లర్​ అనుమానస్పదంగా మృతి చెందాడు. అంతుచిక్కని రోగమేదో సోకి అతను చనిపోయాడని పోలీసులు తెలిపారు.

Serial killer who killed 11 women .. finally dead
11మంది మహిళల్ని చంపిన సీరియల్‌ కిల్లర్‌.. చివరకు!

By

Published : Feb 9, 2021, 10:24 PM IST

11 మంది మహిళల్ని హతమార్చిన కేసులో మరణశిక్ష పడిన ఓ సీరియల్‌ కిల్లర్‌ అంతుచిక్కని రోగంతో మరణించాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఒహైయోకి చెందిన ఆంటోనీ సోవెల్‌ (61)కి మహిళల్ని చంపి ఇంటి పరిసరాల్లో దాచిపెట్టిన కేసులో మరణశిక్ష పడింది. అయితే, కారాగారంలో ఉన్న అతను అంతుబట్టని రోగానికి గురైన సోమవారం ప్రాణాలు విడిచినట్టు అధికారులు తెలిపారు. అతడి మరణానికి కరోనా కారణం కాదని స్పష్టంచేశారు.

సీరియల్​ కిల్లింగ్​ ఉదంతం

2009 అక్టోబర్‌లో పోలీసులు ఓ అత్యాచారం కేసులో సోవెల్‌ను విచారించారు. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో సోదాలు చేయగా.. రెండు మృతదేహాలను గుర్తించారు. ఆ తర్వాత మరింత విస్తృతంగా గాలించిన పోలీసులు 11మంది మహిళల అవశేషాలను వెలికితీశారు.

మహిళల్ని చంపిన కేసులో అరెస్టయిన సోవెల్‌పై నేరం రుజువు కావడంతో 2011లో మరణ శిక్ష పడింది. మహిళల్ని చంపిన కేసుతో పాటు ఇద్దరు మహిళలపై అత్యాచారం, మరొకరిపై అత్యాచారయత్నం కేసులో కూడా న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది.

పదే పదే అప్పీల్​

జైలులో ఉన్న సోవెల్‌.. తనకు కింది కోర్టు విధించిన శిక్షపై పదేపదే అప్పీల్‌కు చేస్తూ వచ్చాడు. తనపై నేర విచారణ నిష్పక్షపాతంగా జరగలేదంటూ పిటిషన్‌ వేశాడు. దీనిపై గతేడాది మే నెలలో ముగ్గురు న్యాయమూర్తుల ప్యానల్‌ విచారించి.. అతడు చేస్తున్న ఆరోపణలపై సరైన ఆధారాలను సమర్పించడంలో విఫలమయ్యాడని పేర్కొంది. ఆరోపణలపై ఆధారాల్లేవని కొట్టివేసింది. అలాగే, తనకు శిక్ష నుంచి మినహాయింపు కోరుతూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది.

ఇదీ చూడండి:నిరసనల మధ్య అట్టుడుకుతున్న మయన్మార్​

ABOUT THE AUTHOR

...view details