తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2019, 10:00 AM IST

Updated : Oct 1, 2019, 4:14 PM IST

ETV Bharat / international

'ఏటా 5 విదేశీ కుటుంబాలను భారత్​కు పంపండి'

దేశంలో పర్యటక అభివృద్ధికి ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏటా కనీసం ఐదు విదేశీ కుటుంబాలను భారత్​కు పర్యటకులుగా పంపాలని కోరారు. హ్యూస్టన్​లో జరిగిన 'హౌడీ మోదీ' అనంతరం జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఏటా 5 విదేశీ కుటుంబాలను భారత్​కు పంపండి'

భారత్​లో పర్యటక రంగం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఏటా కనీసం ఐదు విదేశీ కుటుంబాలను భారత్​కు పర్యటకులుగా పంపాలని కోరారు.

హౌడీ-మోదీ కార్యక్రమానంతరం హ్యూస్టన్​లో ఎటర్నల్​ గాంధీ మ్యూజియం శంకుస్థాపన శిలాఫలం ఆవిష్కరణ, గుజరాతీ సమాజ్ కేంద్రం​​, సిద్ధి వినాయక ఆలయం ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరయ్యారు. తర్వాత ఎన్​ఆర్​ఐలను ఉద్దేశించి ప్రసంగించారు.

"నా కోసం మీరు ఏదైనా చేస్తారా? ఇది చిన్న విజ్ఞాపన మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులకు ఇది చెబుతున్నాను. ప్రతి సంవత్సరం మీలో ప్రతి ఒక్కరు కనీసం ఐదు విదేశీ కుటుంబాలను భారత్​కు పర్యటకులుగా పంపాలనే నిర్ణయం తీసుకోండి."

- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి.

.

ఇదీ చూడండి: అధ్యక్షుడిగా ట్రంప్ మరోమారు గెలవాలి: మోదీ

Last Updated : Oct 1, 2019, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details