కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న రైతులపై భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విచారం వ్యక్తం చేశారు ఇద్దరు అమెరికా సెనేటర్లు. ఈ విషయంపై అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. రైతుల అంశంపై బైడన్ ప్రభుత్వం.. ప్రధాని మోదీతో మాట్లాడాలని కోరారు.
అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, సెనేటర్ బాబ్ మేనెందేజ్, చుక్ షూమర్ గురువారం రోజున బ్లింకెన్‌కు లేఖ రాశారు. శాంతియుత నిరసనలు, భావప్రకటన స్వేచ్ఛ వంటి అంశాలను లేవనెత్తాలని సూచించారు. అయితే.. దీనిపై బ్లింకెన్ ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.