తెలంగాణ

telangana

ETV Bharat / international

న్యూజెర్సీ సెనేటర్​ బరిలో భారతీయ అమెరికన్ - cori booker

2020లో జరిగే అమెరికా ఎన్నికల్లో న్యూజెర్సీ రాష్ట్రానికి సెనేటర్​గా పోటీలో నిలుస్తున్నానని హిర్ష్​ సింగ్​ అనే భారతీయ అమెరికన్ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుతం న్యూజెర్సీ సెనేటర్​గా కోరి బుకర్ ఉన్నారు. బుకర్​ మరోసారి అభ్యర్థిగా పోటీలో నిలిస్తే ఆయనతో ప్రాథమిక ఎన్నికల్లో హిర్ష్​సింగ్ తలపడాల్సి ఉంటుంది. అందులో గెలిస్తే ప్రధాన ఎన్నికల్లో డెమోక్రాట్​ అభ్యర్థితో పోటీ పడాలి.

న్యూజెర్సీ సెనేటర్​ బరిలో భారతీయ అమెరికన్

By

Published : Apr 27, 2019, 8:04 PM IST

వచ్చే ఏడాది జరగనున్న అమెరికా ఎన్నికల్లో మరో భారత సంతతి అమెరికన్ తలపడనున్నారు. న్యూజెర్సీ రాష్ట్రానికి రిపబ్లికన్ సెనేటర్​ అభ్యర్థిత్వ పోటీలో నిలవనున్నట్లు భారతీయ అమెరికన్ హిర్ష్​సింగ్ ప్రకటించారు. హిర్ష్ ప్రస్తుతం అట్లాంటిక్​ కౌంటీలోని రక్షణశాఖ విమానాల తయారీ విభాగంలో ఇంజినీర్​గా పనిచేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు హిర్ష్​సింగ్​ మద్దతుదారు.

న్యూజెర్సీ సెనేటర్​ కోరి బుకర్ మరోసారి పోటీలో నిలుస్తారా లేదా అన్న విషయమై స్పష్టత రాలేదు. నూతన చట్టం ప్రకారం అధ్యక్షుడిగా, సెనేటర్​గా బుకర్ ఏకకాలంలో బరిలో నిలిచే అవకాశం ఉంది. బుకర్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేస్తే హిర్ష్ ప్రాథమిక ఎన్నికల్లో ఆయనపైగెలవాల్సి ఉంటుంది. అమెరికా సమాఖ్య ఎన్నికల కమిషన్ వద్ద తన ప్రచార కమిటీ వివరాలను హిర్ష్ బుధవారం సమర్పించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీలో న్యూజెర్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిల్ పలాటుక్కి ఆమోదించారు.

ముచ్చటగా మూడోసారి పోటీలో

హిర్ష్ సింగ్ ఎన్నికల బరిలో నిలవడం ఇది మూడోసారి. 2017లో జరిగిన గవర్నర్ ఎన్నికల ప్రాథమిక పోటీలో ఓటమి చెందారు. 2018లో కాంగ్రెస్​కు పోటీచేశారు.

ఇదీ చూడండి: 'ఆయుధాల' ఒప్పందానికి అమెరికా దూరం

ABOUT THE AUTHOR

...view details