అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన విచారణ ప్రతినిధుల సభ నుంచి ఎగువ సభ సెనేట్‌కు చేరింది. ట్రంప్ అభిశంసన విచారణపై సెనేట్‌లో మంగళవారం ఈ చర్చ ప్రారంభమైంది. ఛాంబర్ నాయకుడు మిచ్ మెక్కానెల్ విచారణ ప్రక్రియ నియమాలలో మార్పులు చేశారని డెమోక్రాట్లు ఆరోపించారు.
ట్రంప్ అభిశంసన విచారణపై సెనేట్‌లో చర్చ షురూ - latest trump news
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన విచారణపై మంగళవారం ఎగువ సభలో చర్చ ప్రారంభమైంది. అయితే ప్రతిపాదిత నియమాలలో సెనేట్ మెజారిటీ సభ్యుడు మిచ్ మెక్కానెల్ మార్పులు చేయడాన్ని డెమోక్రాట్లు వ్యతిరేకించారు.
ట్రంప్ అభిశంసన విచారణపై సెనేట్‌లో చర్చ షురూ
మొదటి దశకు చెందిన సాక్ష్యులు, సాక్ష్యాలపై కఠిన ఆంక్షలు విధించే నియమాలనురిపబ్లికన్ పార్టీ సభ్యుడు మెక్కానెల్ప్రతిపాదించారు. విచారణను త్వరగా ముగించాలని కోరారు. నియమాలను మార్చేందుకు డెమోక్రాట్ సభ్యులు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని మెక్కానెల్ ఈ సందర్భంగా తెలిపారు.
Last Updated : Feb 17, 2020, 10:56 PM IST