తెలంగాణ

telangana

ETV Bharat / international

అత్యయిక స్థితికి చుక్కెదురు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు సొంత పార్టీ బలమున్న చోటే చుక్కెదురైంది. జాతీయ అత్యయిక స్థితిని ఎత్తేయాలని అమెరికా పెద్దల సభ సెనేట్​ తీర్మానించింది. మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ఎమర్జెన్సీ ద్వారా నిధులు సమకూర్చాలనుకున్న డొనాల్డ్​ నిర్ణయాన్ని తోసిపుచ్చారు రిపబ్లికన్​ సెనేటర్లు.

అత్యయిక స్థితికి సెనేట్ తిరస్కృ-తి

By

Published : Mar 15, 2019, 7:55 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన జాతీయ అత్యయిక స్థితిని ఎత్తివేయాలని అమెరికా పెద్దల సభ సెనేట్​ తీర్మానించింది. అధ్యక్షుడి సొంత పార్టీ సభ్యులే అత్యయిక స్థితికి వ్యతిరేకంగా నిలిచారు.

అత్యయిక స్థితిని ఎత్తేయాలన్న కాంగ్రెస్ తీర్మానాన్ని ట్రంప్ తోసిపుచ్చారు. ట్రంప్​ సొంత పార్టీ రిపబ్లికన్​కుప్రస్తుతం సెనేట్​లో బలముంది. అనూహ్యంగా ఎమర్జెన్సీని ఎత్తేయాలని రిపబ్లికన్​ సెనేటర్లు పట్టుబట్టారు. ఎమర్జెన్సీని ఎత్తేయాలన్న తీర్మానం 18 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. 59 మంది అత్యయిక స్థితిని ఎత్తేయాలని కోరుకున్నారు. 41 మంది సభ్యులు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. వీటోను ధిక్కరించి 12మంది రిపబ్లికన్ సభ్యులు అత్యయిక స్థితికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

వీటోను ధిక్కరించిన సెనేటర్లపై ట్రంప్​ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అయితే ఓటింగ్ పూర్తయిన అనంతరం వీటో అని మాత్రం ట్వీట్ చేశారు.


ABOUT THE AUTHOR

...view details