కరోనా వైరస్ నియంత్రణ, ఆర్థిక స్థిరత్వం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళిక అమలు దిశగా మరో ముందడుగు పడింది. సంబంధిత కొవిడ్-19 ఎయిడ్ బిల్లుకు.. సెనెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనిపై విస్తృత చర్చ జరిగింది. రిపబ్లికన్ల మద్దతు అవసరం లేకుండానే ఈ తీర్మానానికి ఆమోదం లభించడం గమనార్హం. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. తన టై బ్రేకింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనితో సెనెట్‌లో డెమొక్రాట్ల బలం 51కి, రిపబ్లికన్ సభ్యులు 50కి చేరింది. దీనితో బడ్జెట్ తీర్మాన ఓటింగ్‌కు మార్గం సుగమమైంది.
1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి సెనెట్ ఆమోదం - అమెరికా కరోనా ప్యాకేజీ
కరోనా సంక్షోభం నుంచి అమెరికాను గట్టెక్కించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన రెస్క్యూ ప్యాకేజీకి సెనెట్ ఆమోదం తెలిపిది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ టై బ్రేకింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో సెనెట్‌లో డెమొక్రాట్ల బలం 51కి పెరిగింది.
కరోనా ప్యాకేజీకి సెనేట్ ఆమోదం
ఆర్థిక ప్రణాళికకు ఆమోదం తెలపడం అమెరికాను తిరిగి రికవరీ బాటలో పట్టేందుకు తొలి అడుగుగా అభివర్ణించారు సెనేట్ మెజారిటీ నేత చక్ షుమీర్. వేగవంతమైన నిర్ణయాలతో మార్చి లోపు దీనిని అమలు చేయాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.