అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ సెనేట్‌లో వీగిపోయింది. అధికార దుర్వినియోగం, చట్టసభలను అడ్డుకునే ప్రయత్నం వంటి అభియోగాలపై... రెండు వారాల విచారణ అనంతరం ట్రంప్‌ను నిర్దోషిగా ప్రకటించింది సెనేట్.
సెనేట్‌లో వీగిపోయిన అభిశంసన.. నిర్దోషిగా ట్రంప్ - ట్రంప్ తాాజా వార్తలు
Television anchor Manish Paul and actor Ellie AvrRam arrived at the set of Shakti Mohan's dance show titled Break a leg! Set to impress the audience with swift moves, the duo is set to feature in an episode of the much-popular dance show.
03:22 February 06
రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న సెనేట్‌లో ట్రంప్ సులువుగా గట్టెక్కారు. అధికార దుర్వినియోగం అభియోగంపై ఓటింగ్‌లో 52-48 తేడాతో విజయం సాధించారు. సభను అడ్డుకున్నారన్న అభియోగంపై 53-47 ఓట్ల తేడాతో నిర్దోషిగా తేలారు.
అధికార దుర్వినియోగం అభియోగాలపై రిపబ్లికన్ సెనేటర్ మిట్ రోమ్నీ మాత్రం ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం. మరోవైపు సభను అడ్డుకున్నారన్న కేసులో అధ్యక్షుడికి అనుకూలంగా ఓటు వేశారు.
డెమోక్రాట్ల మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభలో డొనాల్డ్ ట్రంప్‌పై డిసెంబర్ 18న అభిశంసన ప్రక్రియ చేపట్టింది. తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్‌పై ఉక్రెయిన్ దర్యాప్తు చేపట్టాలని, ఫలితంగా ఉక్రెయిన్‌కు మిలటరీ సహాయం చేస్తానని ట్రంప్ ఒత్తిడి చేశారని అభియోగాలు మోపింది.