జనవరి 6న క్యాపిటల్ దాడి ఘటనలో ఆందోళనకారులను ప్రేరేపించారన్న అభియోగాలకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సెనేట్ నిర్దోషిగా తేల్చింది. ట్రంప్‌ను అభిశంసించేందుకు ఉద్దేశించిన తీర్మానం 57-43 తేడాతో వీగిపోయింది. ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని నాలుగురోజులపాటు విచారించిన సెనేట్ చివరకు మాజీ అధ్యక్షుడిని నిర్దోషిగా తేల్చింది.
మెుత్తం 100 మంది సభ్యులున్న సెనెట్‌లో ట్రంప్‌పై అభిశంసనకు వ్యతిరేకంగా 57 మంది ఓటువేయగా అనుకూలంగా 43 ఓటు వేశారు. దీంతో శిక్షకు అవసరమైన మూడింట రెండు వంతుల కంటే 10 ఓట్ల తక్కువ రావడం వల్ల అభిశంసన వీగిపోయింది. ఏడుగురు రిపబ్లికన్ సెనెటర్లు ట్రంప్‌ను అభిశంసించడానికి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ.. అవసరమైన 67 ఓట్లు రాలేదు.
ఇదీ చదవండి:సెనేట్ ముందుకు ట్రంప్ అభిశంసన
అగ్రరాజ్య అధ్యక్షుల చరిత్రలోనే రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న వ్యక్తి ట్రంప్ కాగా పదవీవిరమణ అనంతరం కూడా అభిశంసనని ఎదుర్కొన్న వ్యక్తిగానూ నిలవడం గమనార్హం.