తెలంగాణ

telangana

ETV Bharat / international

సుప్రీంలో ట్రంప్​కు ఊరట- పోస్టల్​ ఓట్లపై కీలక తీర్పు - అమెరికా ఎన్నికలు 2020 సుప్రీంకోర్టు

పెన్సిల్వేనియాలో పోస్టల్​ ఓట్ల లెక్కింపుపై అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు ట్రంప్​కు అనుకూలంగా కీలక తీర్పునిచ్చింది. ఎన్నికల రోజున రాత్రి 8 గంటల తర్వాత వచ్చిన ఓట్లను వేరు చేసి లెక్కించాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు పెన్సిల్వేనియాలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయానికి అత్యంత సమీపంలో ఉన్నారు.

US-ELECTION-SC-PENNSYLVANIA
సుప్రీంలో ట్రంప్​కు ఊరట

By

Published : Nov 7, 2020, 11:14 AM IST

ఓట్ల లెక్కింపుపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌కు సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల రోజున రాత్రి 8 గంటల తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను వేరు పరచాలని అధికారులను ఆదేశించింది.

పెన్సిల్వేనియాలోని రిపబ్లికన్ పార్టీ విభాగం దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన సుప్రీంకోర్టు జస్టిస్ శామ్యూల్ అలిటో.. ఈ మేరకు తీర్పునిచ్చారు. అవసరమైతే ఆలస్యంగా వచ్చిన ఓట్లను వేరుగా లెక్కించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విజయం దిశగా బైడెన్..

20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో గెలుపు ట్రంప్​కు కీలకంగా మారింది. మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న ట్రంప్.. పోస్టల్​ బ్యాలెట్​ లెక్కింపు ప్రారంభమైన తర్వాత వెనకబడ్డారు. ప్రస్తుతం ప్రత్యర్థి జో బైడెన్​తో పోలిస్తే 27 వేల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో బైడెన్​ విజయానికి అత్యంత సమీపంలో ఉన్నారు.

ట్రంప్ బృందం ఆరోపణలు..

నవంబర్ 3న రాత్రి 8 గంటలకు పోలింగ్ గడువు ముగిసిన తరువాత భారీగా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని ట్రంప్ బృందం ఆరోపించింది. వీటిని లెక్కించవద్దని ట్రంప్ డిమాండ్ చేశారు. ఎన్నికల రోజుకు ముందు పంపిన బ్యాలెట్లను మూడు రోజుల వరకు వస్తే లెక్కించవచ్చని పెన్సిల్వేనియా కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన వ్యతిరేకించారు.

ఇదీ చూడండి:అధ్యక్ష పదవిపై గందరగోళం వీడేదెన్నడో..?

ABOUT THE AUTHOR

...view details