ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దశాబ్దాల తరబడి ప్రశాంతంగానే జరుగుతూ వచ్చాయి. అయితే ఈమధ్య చోటుచేసుకున్న కరోనా మహమ్మారి, వర్ణవివక్ష నిరసనలు తదితర పరిణామాల వల్ల ఆ దేశంలో అశాంతి, భయాందోళనలు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఓడినట్లయితే అధికార బదలాయింపు శాంతియుతంగా ఉండగలదనే హామీ ఇచ్చేందుకు స్వయానా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే నిరాకరించారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలు రణరంగానికి వేదిక కాగలవనే భయం అమెరికన్లలో వ్యక్తమౌతోంది. పోలింగ్ గంటల వ్యవధిలోకి వచ్చిన నేపథ్యంలో ప్రచార పర్వం ముగిసి భద్రతా చర్యలు ఊపందుకున్నాయి. ఎన్నికల పర్యవసానంగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు, దీపస్థంభాలు తదితరాలపై హెచ్చరిక చిహ్నాలను ఏర్పాటుచేశారు.
అవాంఛనీయ ఘటనల సమాచారం లేదు