అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 15న జరగాల్సిన అభ్యర్థుల రెండో సంవాదం వర్చువల్‌గా నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకిన నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం రెండో డిబేట్ మయామిలో జరగాల్సి ఉంది. తాజా మార్పుల నేపథ్యంలో ఇద్దరు నేతలు వేర్వేరు ప్రాంతాల నుంచి వర్చువల్‌గా పాల్గొంటారు. సమన్వయకర్త, ప్రేక్షకులు మాత్రం మయామిలోనే ఉంటారని నిర్వాహకులు తెలిపారు.
ట్రంప్ నిరాకరణ..