తెలంగాణ

telangana

ETV Bharat / international

మృత నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహం - huge planet orbiting a dead star

అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా'కు చెందిన 'టెస్‌' అంతరిక్ష టెలిస్కోపు సాయంతో ఒక మృత నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమికి 80 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

Scientists for the first time discovered a huge planet orbiting a dead star
మృత నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహం

By

Published : Sep 18, 2020, 7:33 AM IST

ఒక మృత నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. ఇది భూమికి 80 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా'కు చెందిన 'టెస్‌' అంతరిక్ష టెలిస్కోపు సాయంతో ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి డబ్ల్యూడీ 1856బీ అని పేరు పెట్టారు. ఇది గురు గ్రహం పరిమాణంలో ఉంది. తన మాతృ తార చుట్టూ 34 గంటలకోసారి పరిభ్రమిస్తోంది. దీని మాతృ తారలో ఇంధనం ఖాళీ అయింది. ఫలితంగా దాని పరిమాణం భారీగా పెరిగిపోయింది. చివరికి తన కోర్‌ భాగంపై కుప్పకూలిపోయి, శ్వేత మరుగుజ్జు (వైట్‌ డ్వార్ఫ్‌) నక్షత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఇది భూమి పరిమాణంలో ఉంది. ఈ తార కన్నా.. దాని చుట్టూ తిరుగుతున్న గ్రహమే పెద్దగా ఉండటం గమనార్హం.

సాధారణంగా నక్షత్రం అంతమయ్యే క్రమంలో దాని చుట్టూ తిరిగే గ్రహాల శకమూ ముగుస్తుంది. డబ్ల్యూడీ 1856బీ గ్రహం మాత్రం ఈ విధ్వంసాన్ని తప్పించుకుంది. మురుగుజ్జు నక్షత్ర గురుత్వాకర్షణ ప్రభావానికి లోనై, ఆ గ్రహం అక్కడికి చేరి ఉంటుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. "శ్వేత మరుగుజ్జు తారల చుట్టూ కూడా గ్రహాలు ఉంటాయని స్పష్టమవుతోంది. ఇది మాకు ఇంతకుముందు తెలియదు" అని క్రాస్‌ఫీల్డ్‌ చెప్పారు. మరో 500 కోట్ల సంవత్సరాల్లో సూర్యగోళం కూడా శ్వేత మరుగుజ్జు తారగా మారిపోతుందని చెప్పారు. ఆ ప్రక్రియలో భూమి అంతం కావచ్చని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details