తెలంగాణ

telangana

ETV Bharat / international

రిఫ్రిజరేటర్​ అవసరం లేకుండానే టీకా నిల్వ! - complex coacervation method

కరోనా టీకాలకు శీతలీకరణ అవసరం లేకుండా అనుకూల పరిస్థితులను కల్పించే పద్ధతిని అభివృద్ధి చేశారు అమెరికాలోని మిషిగన్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ పద్దతి ద్వారా వ్యాక్సిన్​లను ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిల్వ ఉంచి రవాణా చేయవచ్చన్నారు.

Scientists develop novel method to preserve vaccines without refrigeration
రిఫ్రిజరేటర్​ అవసరం లేకుండానే టీకా నిల్వ!

By

Published : Nov 12, 2020, 9:47 PM IST

కరోనాకు వ్యాక్సిన్​ను కనుగొనేందుకు పరిశోధనలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే పలు పరిశోధనలు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్​ రూపొందించిన అనంతరం.. దాని నిల్వ, రవాణాపై ప్రపంచ దేశాలు కసరత్తు మొదలుపెట్టాయి. ఈ తరుణంలో అమెరికా మిషిగన్​ టెక్నాలజీ యూనివర్సిటీలోని కెమికల్​ ఇంజినీర్లు ఓ కొత్త ఆవిష్కరణతో ప్రపంచం ముందుకు వచ్చారు. టీకా నిల్వకు రిఫ్రిజరేటర్ల అవసరం లేకుండా.. ఓ పద్ధతిని తీసుకొచ్చారు.

సాధారణంగా వ్యాక్సిన్​ రవాణా చేయాలంటే రెండు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. తగినంత చల్లదనం లేకపోయినా.. అందులోని పదార్థాలు తిరిగేంత చోటు ఉన్నా.. వ్యాక్సిన్​లోని ఔషధగుణాలు వ్యర్థం అవుతాయని పరిశోధకులు తెలిపారు. ఈ క్రమంలో నూతన పద్ధతిని అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు.

'కాంప్లెక్స్ కోక్జర్వేషన్' పద్ధతి ద్వారా ద్రవస్థితిలో ఉన్న సింథటిక్​ ప్రోటీన్లును వేరుచేస్తే వ్యాక్సిన్​ చెడిపోకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ద్రవ పొర వల్ల లోపల ఉన్న పదార్థాలు అతుకున్ని ఉంటాయని.. ఫలితంగా వ్యాక్సిన్​కు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ఈ అధ్యయనం బయోమెటీరియల్స్​ సైన్స్​ జర్నల్​లో ప్రచురితమైంది.

ఇదీ చూడండి: 'టీకా​ పంపిణీకి కార్యాచరణ ప్రణాళిక ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details