తెలంగాణ

telangana

By

Published : Mar 31, 2021, 1:14 PM IST

ETV Bharat / international

టెక్సాస్​ పాఠశాలకు భారతీయ-అమెరికన్​ పేరు

ప్రఖ్యాత ఫిజియోథెరపిస్ట్, సామాజిక కార్యకర్త సోనాల్ భూచర్​​కు అరుదైన గౌరవం దక్కింది. టెక్సాస్​లోని ఓ పాఠశాలకు ఆమె పేరు పెట్టనున్నట్లు యాజమాన్యం పేర్కొంది.

trailblazer Sonal Bhuchar
ఆ పాఠశాలకు భారతీయ-అమెరికన్​ పేరు

అమెరికా టెక్సాస్​లోని ఓ ప్రాథమిక పాఠశాలకు భారతీయ-అమెరికన్​ పేరు పెట్టనున్నారు. ప్రఖ్యాత ఫిజియోథెరపిస్ట్ సోనాల్ భూచర్​కు ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం.

సోనాల్​ దాతృత్వానికి గుర్తుగా పాఠశాలకు ఆమె పేరు పెట్టనున్నట్లు 'ది ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్' బోర్డు సభ్యులు వెల్లడించారు. 2023లో రివర్ స్టోన్​ కమ్యూనిటీలో ఈ పాఠశాల ప్రారంభం కానుంది.

బాంబే విశ్వవిద్యాలయం నుంచి ఫిజియోథెరపీ డిగ్రీ పట్టా పొందారు సోనాల్. ఆమె భర్త సుబోధ్ భూచర్​తో​ 1984లో అమెరికాకు వలస వెళ్లారు. ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత విద్యార్థులు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.

సోనల్ 2019లో​ క్యాన్సర్​ కారణంగా మృతిచెందారు.

ఇదీ చదవండి:పౌరులపై మరోసారి మయన్మార్​ సైన్యం వైమానిక దాడి

ABOUT THE AUTHOR

...view details