తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రవాస ఆసియన్లపై దాడుల పట్ల సత్య నాదెళ్ల విచారం - మైక్రోసాఫ్ట్​ సీఈఓ

అమెరికాలోని ప్రవాస ఆసియన్లపై దాడుల పట్ల మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్యనాదెళ్ల విచారం వ్యక్తం చేశారు. హింస, అసహనం, జాతివివక్షను ప్రతి ఒక్కరూ ఖండించాలని ట్వీట్​ చేశారు. అమెరికా చట్ట సభ్యులు కూడా ఈ దాడులను ఖండించారు.

Satya Nadella
ప్రవాస ఆసియన్లపై దాడుల పట్ల సత్య నాదెళ్ల విచారం

By

Published : Mar 13, 2021, 12:16 PM IST

ఆసియన్ అమెరికన్లపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ మైక్రోసాప్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో పాటు పలువురు అమెరికా చట్ట సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్లు చేసిన నాదెళ్ల.. ఆసియన్ అమెరికన్ల పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష, హింస, అసహనం సరికాదని, అది ఏ రూపంలో ఉన్నా తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు. గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు అమెరికా వ్యాప్తంగా ఆసియన్ అమెరికన్లపై 3 వేలకు పైగా దాడులు జరిగాయని ఎఫ్‌బీఐ నివేదిక తెలిపింది.

సత్యనాదెళ్ల ట్వీట్​

2019లో ఈ తరహా దాడులు కేవలం 216 మాత్రమే జరగ్గా.. 2020లో దాదాపు 14 రెట్లు పెరిగాయి. ఇంకొందరు కాంగ్రెస్ చట్ట సభ్యులు కూడా నాదెళ్ల తరహాలోనే విచారం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా ఈ తరహా దాడులు సరికాదన్నారు. ఈ దాడులకు దిగేవారు తక్షణమే ఆ మార్గాన్ని విడనాడాలన్నారు. ఆసియన్ అమెరికన్ల పట్ల అమానుషంగా వ్యవహరించే వారు అమెరికన్లు కాజాలరని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details