అమెరికాలో ఎల్జీబీటీక్యూ హక్కుల ఉద్యమకారిణి, ప్రముఖ న్యాయవాది సారా మెక్‌బ్రైడ్.. డెలావేర్ నుంచి సెనేటర్‌గా గెలుపొందారు. అమెరికా సెనేట్‌కు ఎన్నికైన మొదటి, ఏకైక ట్రాన్స్‌జెండర్‌గా చరిత్రకెక్కారు సారా.
మొదటి ట్రాన్స్‌జెండర్ సెనేటర్‌గా సారా రికార్డు
అమెరికా సెనేట్‌కు ఎన్నికైన మొదటి, ఏకైక ట్రాన్స్‌జెండర్‌గా ప్రముఖ న్యాయవాది సారా మెక్‌బ్రైడ్ చరిత్ర సృష్టించారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో డెలావేర్లో రిపబ్లికన్ అభ్యర్థి స్టీవ్ వాషింగ్టన్‌పై గెలుపొందారు.
సారా
డెమొక్రటిక్ పార్టీకి చెందిన సారా.. ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి స్టీవ్ వాషింగ్టన్‌పై గెలుపొందారు. ఈ విజయంతో అమెరికాలో అత్యున్నత పదవి అలంకరించిన ట్రాన్స్జెండర్గానూ సారా రికార్డు సృష్టించారు. తన విజయానికి సహకరించిన ప్రజలకు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:అమెరికా ఎన్నికల్లో కృష్ణమూర్తి ఘన విజయం