అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వీయ అనుభవాలతో రాసిన 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకం రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది. విడుదలైన నెల రోజుల్లోనే ఏకంగా 33 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. ఈ మధ్య కాలంలో ఏ దేశాధ్యక్షుల పుస్తకమూ ఈ స్థాయిలో అమ్మకాలు సాగించలేదంటే అతిశయోక్తి కాదు.
గతంలో అధ్యక్షులుగా పనిచేసిన బిల్ క్లింటన్ రాసిన 'మై వైఫ్' 35లక్షల కాపీలు అమ్ముడవగా.. జార్జ్ డబ్ల్యూ బుష్ పుస్తకం 'డెసిషన్ పాయింట్స్' 40లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు వాటితో సమానంగా ఒబామా పుస్తకానికి ఆదరణ లభిస్తున్నట్లు ప్రచురణ సంస్థ క్రౌన్ తెలిపింది.