అమెరికా ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. 2016 ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తరఫున రష్యా సహకరించినట్లు తాజా నివేదికలు బయటపెట్టాయని ఆరోపించారు. కానీ, నాపై నిందలు మోపి నాలుగేళ్లుగా దర్యాప్తు చేయించారని మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూపోర్ట్ వర్జీనియాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సభలో ట్రంప్ ప్రసగించారు.
"ఈ కారణంతో నన్ను నాలుగేళ్లుగా లక్ష్యంగా చేసుకుని కక్ష సాధించారు. కానీ, నేను ఆ పని చేయలేదు. రష్యాతో వాళ్లే సంబంధాలు పెట్టుకున్నారు. ఇటీవల బయటికి వచ్చిన కొన్ని పత్రాలు 2016లో రష్యా జోక్యాన్ని రుజువు చేస్తున్నాయి. అది నాకోసం కాదు. హిల్లరీ క్లింటన్ తరఫున చేసినట్లు బయటపడింది. తప్పుడు వార్తలతో వాళ్లు ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు."