మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల ప్రపంచ దేశాలు సంతాపం ప్రకటించాయి. ప్రణబ్ సేవలను గుర్తు చేసుకుంటూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు సంతాప సందేశాన్ని పంపారు.
'రాష్ట్రపతిగా, ఇతర పదవుల్లో ప్రణబ్ ముఖర్జీ అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకున్నారు. రష్యాకు నిజమైన మిత్రుడిగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు.' అని పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రణబ్ మరణం పట్ల సంతాపం తెలుపుతూ అమెరికా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
నేపాల్ గొప్ప స్నేహితుడుని కోల్పోయిందని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి అన్నారు. భారత్, నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తుచేసుకుంటామని ఓలి ట్వీట్ చేశారు.